STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

సఖా!

సఖా!

1 min
313

వసంతంలో పూల పాన్పు కావాలి

గ్రీష్మంలో మంచు ముద్ద అవ్వాలి


వర్షంలో గొడుగులా మారాలి

శరత్కాలంలో వెచ్చటి దుప్పటి అవ్వాలి


హేమంతాల చలి గాలుల్లో

చుంబనాల హద్దులు దాటాలి

నీ మునివేళ్ళతో నా ఒంపుల్లో జ్వాలను రగిలించాలి


నీ కౌగిలిలో

మునిపంటితో చేసే గుర్తులతో నా తనువు పులకరించాలి


విశాలమైన నీ భుజాలపైన ఒత్తిగిల్లి

నా యవ్వన భారాల స్పర్శను నీకు తెలపాలి


ఆకులు రాల్చు శిశిరంలో

నాతో కొత్త ప్రయాణం చేయాలి


సఖా

నాలోని ఆశలకు నువ్వు కొత్త ఊపిరులూదాలి

అని ఆమె కోరుకుంది 

అతనితో తొలి రాత్రి కోరికలెన్నో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract