STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సినిమా కల

సినిమా కల

1 min
8

రంగురంగుల తెరలు

కొత్తరకం పాటలు

పాత మధురానుభవాలు

కాలి పగుళ్ళ నుంచి

కంటి రెప్పల వర్ణనల వరకూ

అన్నీ చూపిస్తోంది

సినిమా


అదే జీవితమని

జీవితమే సినిమా అని

బతుకు నాటకంలో

జూనియర్ ఆర్టిస్ట్ గా మిగిలి

ఇంకా వెతుకుతున్నావా


లైట్ నీ మీద పడట్లేదు

గుంపు నుంచి అడుగు ముందుకు పడలేదు

ఇదే విధి అని

లాజిక్ లేని మాటలు

వింత కథలు చెబుతూ

ఎక్కువ తక్కువలు సరి చూసుకుంటూ

వెళ్ళదీసే బ్రతుకులెన్నో


పేరుకి సినిమా కష్టాలు

అని నవ్వుకునే వాళ్లకు

సినిమా చట్రంలో చిక్కుకుని

బయటికి రాలేక 

శిథిలమయ్యే ఎన్నో బతుకులు చూసి

మాటలే రావేమో..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract