శృతి చేసే
శృతి చేసే
కానలేని చెలియకొరకు..లేఖలెలా వ్రాసెదనో..!
లిపియెలేని భాషలోన..ప్రేమనెలా తెలిపెదనో..!
నాతలపుల కోవెలలో..కొలువైనది ఒక దీపం..
గీయలేని తనరూపుకు..పూజలెలా చేసెదనో..!
నా పలుకులు మాటుతేనె..ఉందంటే తనచలువే..
కొలనిలోని కలువలతో..కబురులెలా చెప్పెదనో..!
వీచుగాలి తరగలలో..తనపాటను వింటుంటా..
కన్నులింటి పాపాయికి..జోలలెలా పాడెదనో..!
ఎగిరిపోవు రాయంచల..నడుమతాను ఎక్కడనో..
అక్షరాల వీణియతో..కాలమెలా గడిపెదనో..!
హృదయలయను శృతిచేసే..కోమలాంగి తానేనోయ్..
చూపలేని రాగాలకు..వరుసనెలా కట్టెదనో..!
