STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics Inspirational

4  

Dinakar Reddy

Abstract Classics Inspirational

శ్రీ సింహాచల వాసా

శ్రీ సింహాచల వాసా

1 min
670

అల వైకుంఠపురములో

సనక సనందనాదుల శాపము

కారణమైనది జయ విజయులకు రాక్షస జన్మము


హిరణ్యాక్ష హిరణ్య కశిపులని వధియింప

శ్రీహరి దాల్చెను వరాహ నారసింహ అవతారములు


ప్రహ్లాదుని కోర్కెను మన్నించి 

హరి కొలువైనాడు సింహాచల క్షేత్రమున 

శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా 

భక్తులను అనుగ్రహించగా

అని తలచి తలచి నీ దరి చేరితి


ఆదరించుట నే నీకు చెప్పతగునా

అన్నపూర్ణకు అన్నవు నీవు

ఇటు నే క్యూ లైనులో చిక్కుకుంటి

వేగిరము దర్శనమిచ్చి నన్ను ధన్యము సేయవే

సింహాచల వాసా అప్పన్నా

ప్రహ్లాద వరదా

గోవిందా గోవింద


Rate this content
Log in

Similar telugu poem from Abstract