సహనశిఖరం
సహనశిఖరం
శీర్షిక:సహన శిఖరం
************************
అత్యున్నత స్థాయిని
అవలీలగా అందుకోగలుగుతున్న
ఆమెకు అడుగడుగునా..ప్రతిబంధకాలే...
అత్యాచారాల తో అవమానాలతో
అవరోధం కలిగిస్తూ
వివక్షా కంటకాలతో
విఘాతం సృష్టి స్తూ
సృష్టి కే మూలమైన ఆమెను...కాదు..అమ్మను
అనుమానం అపార్థాల అగ్ని లో దహిస్తూ
అనునిత్యం శీల పరీక్ష లతో
సాంప్రదాయ సరిహద్దులు గీస్తూ..
కట్టుబాట్ల కంటకాలతో పొడుస్తూ..
హద్దులు లేని సహనాన్ని పరీక్షిస్తూ...
అనాది కాలపు చూపులకు బలిచేస్తూ..
వేధింపుల ఉరితాళ్ళకు
వేలాడేలా చేస్తున్న సమాజమా...!
ఆమెకు ..
సమాన హక్కులు హుళక్కేనా?
స్వేచ్ఛా సౌభ్రాతృత్వం అందని ద్రాక్షేనా?
క్షమయా ధరిత్రికి నిదర్శనమంటారే..
క్షమాగుణం నశించిందో..
ఓర్పు సహనానికి శిఖరమంటారే..
సహనం చచ్చిందో...
ఆమె కాల్చే ప్రతి కన్నీటి బిందువు
సింధువై సునామియై
నిన్ను ముంచక ముందే
చేయూతనే ఆసరానిచ్చి
చెలిమితో రక్షణ నిచ్చి
"మహి" కళ "మహిళే" నని
చాటి చెప్పు...
మరువకు...
ఇంటికే కాదు ఇలకే
దీపమని గుర్తించు..
ఆమె చేసిన బొమ్మలే అందరూ అని
గుర్తించు..
ఆమె కన్నా ఎక్కువ ఈ భువిలో లేరన్న నిజాన్ని గుర్తించు....
