STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

శిశిరపు పరువం

శిశిరపు పరువం

1 min
227

ఆకులు రాల్చు కాలం 

యవ్వనపు ఆశలు కాలం చేస్తాయా

లేక అంట కాగిన మసిలా అంటుకునే ఉంటాయా 

ప్రతి శిశిరం ఇదే ప్రశ్న


తినబోతూ రుచెందుకు అనే సమాధానం

ఆకులు రాలినా

వసంతం మళ్లీ వస్తుందనే నమ్మకమా చెట్లది

మనిషికలా అవకాశం ఉందా

ఉంటే ఆత్మ దేహాన్ని వదలడం శిశిరమా


మళ్లీ వసంతం లాంటి జన్మను కోరుకోవడం మూర్ఖత్వమా

ఏమో

శిశిరం ఎన్ని ప్రశ్నలు గుర్తుకు తెస్తుందో

లోకం వీడినా

మన స్మృతులను శాసించే వారినీ

మనమూ ఒకానొక కాలానికి

స్మృతులుగా మిగులుతామని


ఏదో శృతిలో

రాలే ఆకుల శబ్దంలో

శిశిరపు పరువం

ఎన్ని చెబుతుందో

మళ్లీ వసంతం తెస్తానని భ్రమను ఇచ్చి

ఎక్కడికో వెళ్ళిపోతుంది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract