STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

శిశిర వసంతం

శిశిర వసంతం

1 min
345

యవ్వనమిచ్చే సంపదలు చూసి మిడిసిపడే వారు

సాగిన ముడతల శరీరాన్ని స్థిరంగా ప్రేమించే వారు

లోకమంతా భిన్నమే

నాకు కనిపించేవన్నీ వైవిధ్యమే


ప్రకృతి పారదర్శకంగా ఉన్న చోట

వేణువులు వినిపిస్తూ సెలయేటి చప్పుళ్లకు దారిచ్చే వేళ

ఒక సాయంకాలాన నిన్ను చూశాను


పగటికీ రేయికీ మధ్య దూరం తగ్గేలా 

పొదివి పట్టుకుని కలని నడిపిస్తూ

నీ ఒళ్ళో వాలిపోవాలని ఉంది


అన్యోన్య దాంపత్యం అందుకుని

గాఢమైన అనుభూతులు ముద్దులుగా

మాటలు మరిన్ని చిలిపి చేష్టలు చేసి


నీతో నేను

నాతో నువ్వు

మనలో ప్రకృతి


మన కథ మళ్లీ కొత్తే

ప్రతి సారీ పండక్కి చేసే హడావిడి లాంటి కొత్త

ఆ కథ పేరే శిశిర వసంతం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract