STORYMIRROR

Jyothi Muvvala

Tragedy Classics Fantasy

4  

Jyothi Muvvala

Tragedy Classics Fantasy

శీర్షిక : వీడ్కోలు

శీర్షిక : వీడ్కోలు

1 min
358

 


ఎవరో పట్టుకుని లాక్కుపోయారు

తన ఆశల సౌధాన్ని కళ్ళముందే 

పేక ముక్కల్లా కూల్చేసి

ఎదను గాయాలతో చిత్రించి

కలలను సజీవదహనం చేసి


దగ్ధమైపోయిన ఆశలకు 

 మౌనంగా రోదిస్తున్న ఆమె కళ్ళలో

 నిలిచిపోయా....

కడలిలో చిక్కుకున్న నావలా

ఆశ్రుజలంలో మునిగిపోయా..


చెంత చేరి నిజమై నిలవలేక 

ఊపిరి నిలపలేక

కనుపాపను వీడిన 

కన్నీటిలా రాలిపోయా

చెదిరిపోయిన కలగా కరిగిపోయా


తన జ్ఞాపకాలలో...

తన చుట్టూ గాలిలో పరిమళమై తిరుగుతున్న

మరణం లేని ప్రేమలో...

మరుపే తెలియని మనసులో...!!


--జ్యోతి మువ్వల



Rate this content
Log in

Similar telugu poem from Tragedy