STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Classics

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Classics

శీర్షిక : ఆమె.. విశ్వజనని: జయంత్ కుమార్ కవీశ్వర్ : 29 . 09 .22

శీర్షిక : ఆమె.. విశ్వజనని: జయంత్ కుమార్ కవీశ్వర్ : 29 . 09 .22

1 min
294

శీర్షిక : ఆమె.. విశ్వజనని

ఆమె.. విశ్వ జనని

===============

అపర సృష్తికర్త - విశ్వజనని

సకల జీవులకు జీవన పథ గామిని

కారుణ్యమూర్తి ఆశిశ్సుల వరదాయిని

సర్వ రూపాల , సర్వ నామాల అధినేత్రి 

జీవుల సాత్వికత,ధర్మవర్తనకుఅభయప్రదాత్రి

శాంతి,దయలకు అష్ఠ లక్ష్మి , నవదుర్గా సౌమిత్రి 

కఠినాత్ములకు , నిర్దయులకు ప్రళయ రూపిణి 

భక్తి సు కర్మలకు,ఆధ్యాత్మికతకు కు ప్రణయరూపిణి

 

విశ్వంలోని మాతృమూర్తులందరూ ఆమెస్వరూపాలే

రుజుప్రవర్తనే వారిని చిత్రముగా అందలమెక్కించే

మాతృమూర్తి సర్వజగద్రక్షణి నినిరంతర కర్మచారిణి

ఆమె సౌందర్యలహరి,సర్వులకు వినయామృత ధర్మచారిణి

ఆమె కావ్య , గాన సరస్వతి సకల లలిత కళాభినేత్రి

సాకార, నిరాకార సదృశ ముగ్ధ మనోహర స్వరూపిణి

ఆమె సువర్ణ సుందర

దృశ్య రూపం,

ఆమె అక్షర కవితా కావ్యం

ఆమె కవుల భావాలకు అక్షర రూపం!

ఆమె శక్తికి,మాతృత్వ,దాతృత్వపుప్రత్యేకం

మంచివారికి మానవత్వ విలువల సూచితం 

ఆమెఇలవెలసిన సకల సంపదల అందాల భరిణ

మనందరిపై కురిపించెడు మురిపాల అమృత వర్షిణి 

వ్యాఖ్య : "సర్వులకు జగజ్జనని , మాతృ మూర్తి నిత్య నూతన వందనం .

  పాదాభి వందనం,సర్వ విధముల అర్చనచందన సుమ గంధంసృష్టికి మూలం,"

--------------------

పేరు : జయంత్ కుమార్ కవీశ్వర్

(కవి, ) 29 . 09 . 2022


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract