శాంతము
శాంతము
రెప్పమాటు తలపులన్ని..రాలినంత శాంతము..!
కాంతిపూల వానసాక్షి..మరిగినంత శాంతము..!
వెలతెలియక వెలకట్టే..గుణముతోనె యాతన..
తడియారని గాయంలా..మిగిలినంత శాంతము..!
ప్రేమవిలువ తూచేరా..తక్కెడింట అరెరే..
దైవత్వపు చిరునామా..అందినంత శాంతము..!
ప్రణయభావ లాహిరిలో..విరహమెలా ఉండును..
అనుక్షణం జాతరలా..తోచినంత శాంతము..!
ప్రపంచాన్ని శాసించే..అక్షరమే బ్రహ్మము..
సమభావం గుండెలోన..విరిసినంత శాంతము..!

