STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అస్తిత్వం

అస్తిత్వం

1 min
1



ఈ మనిషి జననమే ఒక అస్తిత్వం
అమ్మా నాన్నలు, కుటుంబంతో తొలి ఉనికి
పుట్టుకతో ఆరంభమయ్యే అస్తిత్వ స్థితి
మరణంతో భౌతికంగా ఒక అనస్తిత్వం

ప్రతి శ్వాసలో ఓ జీవిత అన్వేషణ
బతుకు అర్థమవడమే నిజమైన అస్తిత్వం
నీ పుట్టుకకు కారణ–ఫలిత నిర్ధారణ
చావుకు ముందే అంతిమ లక్ష్య సాధన

కేవలం నీ పేరు, ఊరుతో లేదు అస్తిత్వం
కష్టాలపై, కన్నీళ్లపై పోరాటమే నీ స్థితప్రజ్ఞ
చిరునవ్వు వెనుక దాగిన కన్నీటి సుడులు
నీ ధీరత్వంతో సాధించే గెలుపే నీ రాబడులు

పడి లేచిన కేరటానిదే నిజమైన అస్తిత్వం
బలహీనమైన క్షణాలే అస్తిత్వానికి మూలాలు
ఓడి గెలిచినప్పుడే తెలుస్తాయి నీ బలాబలాలు
ఓటమి వెంటాడినా వెన్నుచూపని వైనాలు

ప్రకృతి నేర్పిన ప్రతి నిస్వార్థ పాఠమే జీవితం
పంచభూతాలేవీ తమ ఉనికిని చాటుకోవు
అస్తిత్వ ఛాయలు అలసిన రోజున మారవు
మళ్లీ లేచి నిటారుగా బతకడమే నీ అస్తిత్వం

నీకు నీవు మాత్రమే బతకడంలో లేదు అస్తిత్వం
మరొకరి జీవితాన్ని వెలిగిస్తే అదే చరితం
మానవత్వపు విత్తనాలై మొలకెత్తే ఆ దినం
తరతరాల హృదయాల్లో నిలిచే నీ చైతన్యం

నీ అస్తిత్వం ఉన్నంత వరకే నీ సంపద
కోల్పోయిన మరుక్షణమే నీకు ఆపద
ఉచ్ఛ్వాస–నిశ్వాసల మధ్యే నీ బతుకు
ఆగిన ఊపిరితో అదృశ్యమయ్యే నీ ఉనికి!


Rate this content
Log in

Similar telugu poem from Classics