STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కథలా మొదలైన నేను...???

కథలా మొదలైన నేను...???

1 min
6



కథ మొదలైన క్షణం నేనే.
కథ నడిచిన ప్రతి దారీ నేనే

కథలో నవ్వుల ప్రతిధ్వని నేనే
కథలో కన్నీటి చరిత్ర నేనే

కథకు అర్థమిచ్చిన అనుభవం నేనే
కథకు ప్రాణం పోసిన శ్వాస నేనే

కథ ముగిసిందని ప్రపంచమనుకున్నా...
ఆ ముగింపులో దాగిన కొత్త ఆరంభం నేనే

పూచిన పూలలో పరిమళమై... 
రాలిన రేకులలో విరహమై...
వెన్నెల పరిచిన రాతిరిలో వెతికే కలలో...
నీడలా... నీ వెనుకే... నిలిచిన నిజమై... 
ఆ నందము... ఆ వేదన...రెండు నేనే...

చెప్పాను నీకు... అర్థం కాలేదు...
అని నీకు తెలుసు... అయినా అడగలేదు...
మాట్లాడని మౌనము నేనే...

మరిచిపోలేని జ్ఞాపకము నేనే...
పగిలిన అద్దంలో కనిపించే ముఖం... నేను 
ముక్కలైనా సత్యమే చెప్పే నేనే

నువ్వు వెళ్ళిన దారిలో రాలిన గాలి...
ఆ గాలిలో మోసిన నీ పేరు నేనే....

తిరిగి రా లేదని తెలిసినా కూడా...
తలుపు తెరిచి నిలుచున్న తపస్విని నేనే... 

ఓడిన యుద్ధము... ఓడని గుండె...
పోయినదానికై రోదించిన రాత్రి నేనే...

వచ్చే తెల్లవారకై మేల్కొన్న వెలుతురు...
చివరి శ్వాసలా... నిశ్శబ్దం... నేను....!!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics