STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కట్టేశా

కట్టేశా

1 min
1


నా వేదన చేదుకునే..పాటజట్టు కట్టేశా..!
కన్నీటిని కాల్చుకునే..పాటజట్టు కట్టేశా..!

మోహమెంత చిలిపిదంటె..అందదులే వర్ణించగ..
లోలోపల నిలుపుకునే..పాటజట్టు కట్టేశా..!

ధనం గాక మాయలోకి..నెట్టేసే బలమేదోయ్..
మనసుతోటి ఆడుకునే..పాటజట్టు కట్టేశా..!

ఎలా నీకు చెప్పాలోయ్..దగాచేయు మాటలతో..
మౌనంలో పాడుకునే..పాటజట్టు కట్టేశా..!

మరపు వరం కావచ్చును..మరువలేని తనమేంటో..
గుండె కోసి పిండుకునే..పాటజట్టు కట్టేశా..!

బాధ రుచిని చూడలేని..బాధెందుకు మోయాలట..
బాధపట్టు వదులుకునే..పాటజట్టు కట్టేశా..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics