STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నాలో నేను

నాలో నేను

1 min
1

ఇది నాది అనుకున్నా అది కాలేదు
అది నాది అనుకున్నా అది కూడా నాది కాలేదు
ఇది అనుకునే లోపు అది వచ్చింది
అది అనుకునే లోపు ఇది వచ్చింది
కాలం చేసే మాయలో మనసంతా అయోమయం
కానీ నిరాశ పడకుంటే నీదే ఈ విజయం
చేతిదాకా వచ్చింది చేజారిపోయినా
కంటి ముందే అనుకున్నది కరిగిపోయినా
కుంగిపోతే ఎలా నేస్తం గుండె నిబ్బరముంటే
తలుపులే మూసుకుపోతే దారులే కొత్తగా పుట్టవా?
నిన్నటి ఓటమి నేర్పిన పాఠం
రేపటి గెలుపుకు తొలి బాట
నిన్నటి ఓటమి నేర్పిన పాఠం
రేపటి గెలుపుకు తొలి బాట
కాలం చేసే మాయలో మనసంతా అయోమయం
కానీ నిరాశ పడకుంటే నీదే ఈ విజయం

కష్టాల చీకటి కమ్ముకున్నా వెలుగు వెతుకుతూనే ఉండు
చేయి జారిన కలలకై కన్నీరు ఆపకుండా కడుపు మంటతో ఉండు
వచ్చేది ఏదో వచ్చేసింది
పోయేది ఏదో పోయింది
ఇక నీ లక్ష్యమే నీ లోకం కావాలి
ఈ ప్రపంచమే నీ విజయానికి తలవంచాలి
ఇది అనుకునే లోపు అది వచ్చింది
అది అనుకునే లోపు ఇది వచ్చింది
కాలం చేసే మాయలో మనసంతా అయోమయం
కానీ నిరాశ పడకుంటే నీదే ఈ విజయం
కాలం చేసే మాయలో మనసంతా అయోమయం
కానీ నిరాశ పడకుంటే నీదే ఈ విజయం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics