STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నా ప్రాణం

నా ప్రాణం

1 min
1

ఎంత పని చేసావే... అలా ఎలా వదిలేసావే...
నువ్వే నా ప్రాణం అన్నావే...
నువ్వే నా జీవితం అన్నావే...
నీతో ఉంటే బాగుండేది కదే...
నా గుండె మారిపోతే బాగుండేది కదే...
చరణం 1:
మందు మానేయమన్నావే...
సిగరెట్టు మానేయమన్నావే...
నన్ను మనిషిని చేసావే...
మనసుని మాత్రం ముళ్ళు చేసావే...
నువ్వే నడిరోడ్డున వదిలేసావే...
నన్నే నట్టేట ముంచేసావే...
ఎంత పని చేసావే... అలా ఎలా వదిలేసావే...
నువ్వే నా ప్రాణం అన్నావే...
నువ్వే నా జీవితం అన్నావే...
నీతో ఉంటే బాగుండేది కదే...
నా గుండె మారిపోతే బాగుండేది కదే...

నా దారిన నేనుండగా... దారులు మూసేసావే...
నా జీవితానికి కొత్త కలలు చూపావే...
చివరికి కలగానే మిగిల్చేసావే...
బతికున్న శవంలా నేనున్నాగ...
నీకోసం మారిన నన్ను... మధ్యలోనే మార్చేసావే...
ప్రేమంటే ఏంటో నా ప్రాణానికి చూపావే...
ప్రేమ పేరుతో బతుకంతా చిద్రం చేసావే...

నువ్వు లేని మదిలో... ప్రతిరోజూ కన్నీళ్లే...
ప్రేమ పేరుతో నన్నెంతో క్షోభ పెట్టావే...
మరణాన్ని మించిన నరకం చూపావే...
నీ ప్రేమే నా జీవితానికి శాపమైపోయేలా చేసావే...
ఎంత పని చేసావే... అలా ఎలా వదిలేసావే...
నా గుండె మారిపోతే బాగుండేది కదే...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics