మనిషివా... మరమనిషివా...???
మనిషివా... మరమనిషివా...???
నోరులేని పక్షులూ, గుంపుగా చేరి ఆపదను పంచుకుంటాయి,
నోరున్న మనుషులం మాత్రం, స్వార్థం చూసి దూరంగా పారిపోతాం!
కాలం మారింది...
నాడు 'కలిసి ఉంటే సుఖం' అన్నారు,
నేడు కలిసి ఉంటే 'వెన్నుపోటు' అంటున్నారు!
నువ్వు కూడబెట్టే కోట్లు... రేపు నీ చితి మంటలను ఆపలేవు,
నువ్వు గెలిచిన సామ్రాజ్యాలు... నీ ఆఖరి శ్వాసను కొనలేవు.
పక్కవాడిని నలిపేసి నవ్వడం కాదురా జీవితం,
సాటి మనిషి కన్నీరు తుడిచి, నీ గుండెల్లో తడి ఉందని నిరూపించుకోవడం!
ఇంకెన్నాళ్లు ఈ నటన? ఇంకెన్నాళ్లు ఈ పరుగు?
డబ్బు కాదురా శాశ్వతం... నువ్వు పంచే ప్రేమే నీ ఆఖరి గమ్యం.
ఇప్పటికైనా మేల్కో...యంత్రంలా మారిన ఓ మరమనిషి!
కాస్త మానవత్వం చూపించి... మనిషిలా బ్రతుకు...!!!
