అతడు
అతడు
ఏమదిలో మాయమర్మం దాగుందో.
ఏచూపులో ఎంత కోపముందో.
ఆనవ్వుల వెనుక ఏనటన దాగుందో.
ఏం దాచుకున్నాడో ఎవరికి ఎరుక.
తియ్యని మాటలు పలుకుతున్నాడు.
నిన్ను మించి ఎవరు లేరంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.
ఏ అవసరం వచ్చిపడిందో తెలియదు కధ.
నిన్ను అతని మాయలో పడేస్తున్నాడు.
ఎలాంటి వేదనకు గురిచేస్తాడో.
ఏబాధను పరిచయం చేస్తాడో.
పడుకుంటే నిద్రరాని ఆలోచనల్లో ముంచేస్తాడేమో..
కన్నీటి వర్షంలో తడిపేస్తాడు కాబోలు.
జీవితాలు చీకటిమాయం.
బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు.
ఎవర్ని నమ్మలేని నమ్మకం.
నమ్మలేని నిజాలు.
నమ్మించే అబద్ధాలు.
జీవిత ప్రయాణంలో ఎన్నో పాఠాల గుణపాటాలు.
