STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కలువభామ

కలువభామ

1 min
1

నీకన్నులు పద్మములే ఓష్ఠ్యములు తామరలే
ఆనందం చిందించే నీమోమూ కలువేగా|

పువ్వులు గుబాళింప పరవశించి పోయావేమో
సత్వము రంజిల్లా చిరునగవులు పెదవులపైనా
రజస్సు కలిగించీ నామనసున పూజ్యములాయే
తమస్సు నిర్జించే రవికిరణపు పోకడలాయే

ఇంతినవ్వు సిరిధామము ఇల్లునెరపు ఓం కారము
పడతినగవు పరిహారము సంకటహర శ్రీ కారము
ఇడుముతీర్చ నయగారము సర్వవిధము హుం కారము
సారస్వత మిచ్చువేళ పసిడిపువ్వు ఐం కారము

నవ్వుపూల సోయగమా నాడెందము నుండునీవు
మోడ్పుగొన్న కన్నులతో మమతలనూ పంచునీవు
విరాజిల్లు నామదిలో సమతలనూ పంచనివ్వు
నాదుప్రేమ తలమానిక నీదునవ్వు యివ్వనివ్వు 


Rate this content
Log in

Similar telugu poem from Classics