STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీలికార్పాసం_ప్రేమప్రహసనంబం

నీలికార్పాసం_ప్రేమప్రహసనంబం

1 min
2


రంగవిల్లు చేతికద్ది విరులొదిలిన వన్నెలాడి
సంస్కృతీ సాంప్రదాయ మెరింగినా కోమలిదే
సవరించూ శిరోజాలు నాగుబాము సంకేతము
శివునిమెడను అలంకార వాసుకియే నన్నటులా 

మగరాయుని మానసమూ రతీదేవి శరీరమూ
చూసిపోవు అందమదా కామితార్థ పూబంతీ
కాలధర్మ మేచేయుద ననువరకూ తోడు కోరు
సౌందర్యం తనసొంతం ప్రాప్తమైన పండుగలే 

అరవిందం మోముజూడ భ్రమరంబై నేజేరగ
విరితేనియ లూరునెడా మోవిలోన తేనెపట్టు 
స్వీకరించ మనసాయె నీమోదము తెలిపేవా
ఆనందము దరిజేరీ ఆస్వాదన జేతునులే

కాంతులీను మేనువేసె రవిమరుడూ కలిసినట్లు 
బాణమదే రసరమ్యం ఆలింగన ఆహ్వానం
పంపితేను పారవశ్యం నదిచేయూ సంగమమూ
సాగరపూ సంగమమే మదిచెందా సంబరమే 


Rate this content
Log in

Similar telugu poem from Classics