అనుబంధాలు
అనుబంధాలు
మానవ మనుగడకు సహజ సంబంధాలు
మనిషికి బంధమేలేని అనుబంధం లేదు
బంధాలు లేకుండా సంఘజీవులు కాదు
పుట్టుకతో వచ్చిన జన్యు సంబంధాలు
అమ్మానాన్నల ఆత్మీయ రక్తబంధాలు
తోబుట్టువులు తోడుగా ప్రేమానురాగాలు
కుటుంబ నేపథ్యంతో తన ఉనికి సరాగాలు
శైశవం, బాల్యంతో మొదలయ్యే స్నేహాలు
కౌమార దశలో ప్రేమ, శృంగార భావనలు
యుక్త వయసున దాంపత్య బంధనాలు
ఏ దశలో ఆ దశకు చేరే అవసరానుబంధాలు
వృతిలో, ప్రవృత్తిలో పెనవేయు బంధాలు
అడుగడుగునా అవసరమగు అనుబంధాలు
సహకారం, సంయమనం సరైన మార్గాలు
ఒకరికొకరు లేనిదే సమకూరని పరిష్కారాలు
సమిష్టి కృషితో ఈ సమాజ పురోగతులు
చేయి చేయి కలిస్తేనే పలు విజయావకాశాలు
ఉమ్మడి కుటుంబాల ఊరుమ్మడిబతుకులు
నేటి వ్యష్టి కుటుంబాల గతుకుల వ్యథలు
అవకాశవాద స్వార్థంతో తరిగిన బంధాలు
ఆర్థిక సంబంధాలుగా మారిన నేటి బంధాలు
పగలతో, ఈగోలతో ఊసురుమనే ఉన్మాధాలు
మాయమవుతున్న నేటి మానవ సంబంధాలు
ఇంటితో బడితో విలువల రక్షణ, పరిరక్షణలు
సంఘ నడవడితోనే సామాజికీకరణ శిక్షణలు
శాంతి, అహింసతో అనుబంధాల పునాదులు
నిస్వార్థ త్యాగాలతో నిజమైన అనుబంధాలు!
