Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

murali sudha

Abstract

3  

murali sudha

Abstract

సాత్విక

సాత్విక

1 min
205


సాత్విక.....


మడికట్టు కట్టుకున్న నా దేహం

అనేకానేక రంపాల మధ్య చిక్కుకోబోయే

సజీవ శిలకు తార్కాణం


ఎవరికేం తెలుసు

నా లోపల ఎన్ని సుళ్ళు మౌన ముద్రలు వేస్తున్నాయో

ఎవరికేం అంచనా ఉంటుంది

నా వేదన భాగాలు ఎన్ని తునకలై లోలోపలే విరుచుకు పడుతున్నాయో


అతనికా...

అతని ప్రబంధానికి నా చుట్టు కొలతలు తూనికరాళ్లు

ఇతనికా....

ఇతని వాదనా పటిమకు నా రూపురేఖలు వజ్రాయుధాలు

అదిగదిగో అతగాడికా....

ఆతడి ఆకలికి నేనో నిండుకుండలాంటి ఆహారం

ఇదిగిదిగో ఈతడికా....

ఈతడి ప్రజ్ఞా పాటవాల వ్యాప్తికి నేనో పేరులేని వాహకం


క్షితిజ సమాంతర రేఖలపై

నా వర్ణమో మాయని మచ్చ

అస్తిత్వ వాదాల వేదికపై

నా వర్గమో అలకిన ముగ్గు

ఇక్కడెవ్వరికీ అక్కరలేని నేను

సంప్రదాయాన్ని మోసే ధోవతి కట్టు

దాష్టీక దౌర్జన్య సొరంగంలో

నేనో మేలిమి వజ్రాన్ని

మగ్గుతున్నా విలువ తగ్గని సువర్ణాన్ని

అవహేళనల అపహాస్యాల

పాత్రలో నేనో మధువుని

మత్తెక్కిస్తూ సమసిపోయే అక్షయ ఆర్భాటాన్ని


నా నుదుటి బొట్టుకెన్ని వర్ణనలో

ఆ ఎరుపు వెనుక అంతే వేదన

నా పచ్చటి పాదాలకెన్ని ప్రేమ పలకరింపులో

నా పసిడి ఛాయపు మేనికి అన్నే మచ్చలు


అదృష్ట తనువే నాది

దురదృష్ట రాతతో పోటీ పడుతూ

సంకల్ప సృష్టే నేను

అసంబద్ధ మలినాల్లో కూరుకుంటూ

మర్యాదా మన్ననల పిలుపులే నా చుట్టూ

అంతరాంతరాల్లో జుగుప్సాకర కేకలు వేసేస్తూ


ఇంతకీ.....

ఎవ్వడిని తడపాలి నేను కామంతో

ఎవ్వడిని లేపాలి నేను అమలిన శృంగారంతో

ఇంకెవ్వడికి సాధనమవ్వాలి నేను 

ఆరుగజాల పవిత్రతతో

ఇంకెవ్వడికి ఆయుధమవ్వాలి నేను అర్ధ శరీరపు చితితో


విరిగిన మనస్సుతో అడుగుతున్నా

వేల సంవత్సరాల ప్రశ్నల్ని

వేల వసంతాల నిరీక్షణల్ని.....


సుధామురళి


Rate this content
Log in

Similar telugu poem from Abstract