STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

చిన్నదాని మనసు

చిన్నదాని మనసు

1 min
299

తళుకు బెళుకులు ఎన్నో

వయసిచ్చిన ఆలోచనలు ఎన్నో


తపనలెన్ని దాగినవో

వగలు ఎన్ని చూపినా

చిన్నదాని మనసు

ఎరుగవేమి నీవు


కంటి కాటుకలో వ్రాసుకున్న నీ పేరు

కాళ్ళ గజ్జెల్లో నీ గుండె చప్పుళ్ళు

తడమాలని నీ మనసు నిధిని

పట్టిన ఆమె నోము


ఏమీ అర్థం కావా

ఓ చిన్నవాడా

చిన్నదాని మనసు గెలుచుకున్నవాడా

నీ నవ్వుతో పండించు ఆమె చేతిలో గోరింటాకు


ఆపైన వచ్చే శ్రావణ మాసానికి

తీసుకురావోయి 

ఆమె మెళ్ళో కట్టడానికి తాళి బొట్టు


తాళి బొట్టు తెస్తనని

తాళ్లరేవుకెళ్ళిండు మావా

అని పాడే ఆ చిన్నదాని పాట

వినపడలేదా


చిన్నదాని కళ్ళల్లో

నీపైన ప్రేమ కనబడలేదా..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract