STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

నిన్ను చూడగానే

నిన్ను చూడగానే

1 min
394

మరచిపోయాను నేనెవరో

మరచిపోయాను నా బాధేంటో

మరచిపోయాను నా కథేంటో

నిన్ను చూడగానే


మరచిపోయాను అలుపును

నీ వెనుక తిరుగుతూ

మరచిపోయాను దిగులును

నీ మువ్వల పట్టీల చప్పుళ్ళు వింటూ


మరచిపోయాను ఎండను

నిను తాకి నాపై చేరిన గాలులతో

మరచిపోయాను చలిలో వణుకును

నిను కౌగిలించుకున్న ఊహలతో


మరచిపోయాను ఆకలిని

నీ చూపుల్ని ఆరగిస్తూ

మరచిపోయాను మిగతావన్నీ

నిన్నే ఆరాధిస్తూ


మరచిపోయాను నేనెవరో

నిన్ను చూడగానే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract