సాక్ష్యముగా
సాక్ష్యముగా
కనురెప్పల రాగాలే..కాలాలకు సాక్ష్యముగా..!
గుండెలయల నాదాలే..ప్రాణాలకు సాక్ష్యముగా..!
శ్వాసకెంత ఆత్మీయత..మనసుగుట్టు దాచుకోగ..
అనురాగపు ద్వారాలే..బంధాలకు సాక్ష్యముగా..!
చెలిమిపూల ఊయలలో..మురిసిపోవ వేడుకలే..
పలుకుతేనె మౌనాలే..భావాలకు సాక్ష్యముగా..!
ఏకాంతం బహుమతిగా..దొరికేనా ప్రార్థించిన..
అరకన్నుల పయనాలే..లోకాలకు సాక్ష్యముగా..!
మాయమనసు కన్న గొప్ప..నేస్తమెవరు హృదయానికి..
జ్ఞాపకాల కావ్యాలే..బీజాలకు సాక్ష్యముగా..!

