సాక్షితోటి
సాక్షితోటి
పరవశాలు రాలుతీరు..చూడాలని ఉన్నది..!
సాక్షియైన సాక్షితోటి..కలవాలని ఉన్నది..!
వాదులాట ఒకచక్కని..విందైనది చెలియకు..
చెలివేదన తీర్చుదాక..బ్రతకాలని ఉన్నది..!
జన్మగుట్టు పట్టేసుకు..పాడుకునే దెపుడో..
నిప్పురుచిని ఒకపాటగ..మలచాలని ఉన్నది..!
కర్మగాక కాళ్ళబడ్డ..తిప్పతీగ ఏదోయ్..
బతుకుతీపి మత్తుసరిగ..వదలాలని ఉన్నది..!
మనసు పడక రాదు,లేదు బతుకన్నది - కోరిక..
మరణం ఓ విరామమని..చెప్పాలని ఉన్నది..!
మందులన్ని కలవుచూడ..చిన్ని కణములోనే..
చైతన్యపు సీమలోన..ఉండాలని ఉన్నది..!
