రుద్రం
రుద్రం
రుద్రం రుద్రం రుద్ర నేత్రం..
నా మనసే అగ్ని హోత్రం
జపాకుసుమాల త్రినయనం
వికసిత వదనం వందనం
కస్తూరి తిలక కాంత శోభతో
రుద్రాక్ష మకుటధారుడవైన నీకు
రక్త తిలకం సమర్పించనా
సౌగంధిక పుష్పాలు తేలేను గానీ
సహస్రనామల తోరణాలు
చదవగలను..
అరచేతిలో దీపాలు వెలిగించగలను..
ఆత్మని నైవేద్యంగా నివేదన చేయగలను..
