రక్షణ కవచం
రక్షణ కవచం


ఎందరో వైద్యులు, వారి కుటుంబాలు
వైద్యులకు సహాయ శాఖల ఉద్యోగులు
రక్షకభటులు, పాలు, కూరల వర్తకులు
నిత్యావసర వస్తువుల వ్యాపారులు
వార్తా పత్రికలు, మీడియా ప్రతినిధులు
పారిశుధ్య పనివారలు, ఎంతమందని
ఇంకెంత మంది, మనందరి కోసమని
ప్రాణాలను పణంగా పెడుతున్నారని,
మనమంతా బ్రతికి బాగుండాలని
మనం బాగుంటే వారికి ఒరిగేదేమని
తమ కుటుంబాలను, ప్రియమైన వారిని
సైతం లెక్కచేయక అందరినీ వదులుకొని
చేస్తున్నారు వారంతా శక్తికి మించిన సేవని
మరి మనం బదులుగా ఏం చేస్తున్నామని
శెలవులిచ్చారని, హాయిగా బైట తిరగాలని
అడ్డుపడుతున్నారని పోలీసులని తిట్టుకొని
వ్యాపారులు అడిగినంత సరుకు ఇవ్వలేదని
ఇసుమంతైనా ఆలోచించక, చూపిస్తాం కోపాన్ని
ఎందుకు గుర్తించం, వారూ మనుషులే నని
బ్రతికి ఉన్నంత కాలం వారికే ఋణ పడతామని
ఇప్పటికైనా గుర్తించండి మనం చేయలేని పని
వారు చేస్తున్నారని, మనం సహకరించాలని
అవహేళన చేసి, వైరస్ పై ఛలోక్తులు వేయరాదని
గుర్తించండి మనం లోపలే ఉండి సహకరించాలని
మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటించాలని
కుటుంబ క్షేమం కోరి, శుభ్రతకు ప్రొముఖ్యత నివ్వాలని
ప్రస్తుత పరిస్థితుల్లో అవే మనకు రక్షణ కవచాలని
అప్పుడే తిరిగి సాధారణ స్థితికి చేరుకో గలమని
మనవి చేస్తున్నా అందర్నీ నిబంధనలు పాటించమని
🙏🙏🙏