STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Fantasy Inspirational

4  

VENKATALAKSHMI N

Tragedy Fantasy Inspirational

రక్షా రేఖ

రక్షా రేఖ

1 min
273

శీర్షిక:రక్షారేఖ

************************

గుండె లోని గురుతుల మూటను గుట్టు విప్పి

గడ్డకట్టుకున్న మమత కంటి చమరింపుగ మారి

అర్థంలేని ఆంక్షలను దాటుకుని అహంకారపు పొరలు చీల్చుకుని

పోగేసుకున్న కుతంత్రాలను తుడిచి పెట్టి

గిరి గీసుకున్న ఆస్తి పద్దులను మడత పెట్టి

బంధనాలుగా మారిన కొన్ని బంధాలకు నచ్చచెప్పి

దశాబ్దాల క్రితపు తీపి గురుతులకు

అత్తరు పూసి గుభాళించే గులాబీ లుగా మలచి

ఆత్మీయుల వాత్సల్యపరిమళాలను అద్దిన

నూలుపోగు దారాలను నిండుగా చేతికి చుట్టి

నూరు జన్మల అనుబంధానికి ఊపిరులనద్ది

సోదరి సోదరునికి కట్టే రక్షనే రాఖీ

వెలవెల బోతున్న జీవితానికి వెలుతురై

గుండె గూటికి కొండంత ధైర్యాన్నిచ్చి

నీకు నేనున్నాననే భరోసానింపి

రక్షణరేఖయై నిలుస్తావని కట్టే ఈ రాఖీ

సోదరి సౌభ్రాతృత్వంకు పీఠిక

సనాతన సాంప్రదాయపు వేడుక


Rate this content
Log in

Similar telugu poem from Tragedy