రెండొకటిగా..
రెండొకటిగా..
1 min
386
ప౹౹
ఏదో విషయం చెప్పాలని తలచాను
మదినే ఆ విషయమై మరి తెరచాను ౹2౹
చ౹౹
కలలో ఉలికిపాటునే తెచ్చే ఆ కలతే
వలపులోన తొందర పాటు ఓ వెలితే ౹2౹
మగువ మనసు మరులలో మర్మమే
తెగువతో ప్రేమనే తెలుపుట ధర్మమే ౹ప౹
చ౹౹
కలిసొచ్చే కాలమే కలిసి మురిపించే
కలలోకొచ్చి గాలమేసేసి మరపించే ౹2౹
ఎంతో గొప్పది తీయని హృదయం
మనసులో ఆ ప్రేమకు మహోదయం ౹ప౹
చ౹౹
చెలిమి చెలరేగి సాగే ప్రేమ జ్ఞాపికగా
మేలిమి గుర్తులన్నీ దాచాలి ఓపికగా ౹2౹
ఎడబాటు లేని ఎదలూ రెండొకటిగా
తడబాటు లేక కలవాలి ఏకతాటిగా ౹ప౹