STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

పూవులు - దారం

పూవులు - దారం

1 min
336

ఆరోజు బస్టాపులో నందివర్దనాలు

వాటి వెనుక దాక్కున్న నేను

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు

నువ్వు నన్ను చూడలేదనుకున్నా


తరువాత డేరా పూలు

వాటి తర్వాత మందారాలు

చాలా సార్లు పూలకొట్లోంచి చూశాను

నిన్ను చూస్తూ పూల మాలలు కట్టాను


నువ్వు నన్ను చూడకూడదు

నేను నిన్ను రోజూ చూడాలి

అంతే

ఎందుకని అడక్కూడదు


అలాగని నువ్వు బస్టాప్ కి రాకుండా మానేస్తావేమో

ఆపని మాత్రం చెయ్యకు

ఎందుకిదంతా అని అడక్కు

నాకూ తెలీదు


అయినా పూలని కలిపి దండ చేస్తాం

వాటి సువాసన కాస్త దారానికి కూడా ఇచ్చేస్తాయి పూలు

దారం ఎందుకని అడుగుతుందా చెప్పు

లేదు కదా

అంతే మనం కూడా

నీ సువాసన నన్ను అల్లుకుంటే చాలు

నీ నవ్వులు కాసిన్ని జేబులో వేసుకుంటే చాలు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract