STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పుట్టిన రోజు

పుట్టిన రోజు

1 min
316

నీ పెదవుల తడి

నను తాకిన క్షణం

నీ కురులు నను కమ్మిన నిమిషం

మన్మథుని పరీక్షల కాలం

మరో పుట్టిన రోజు


పెసరట్టు మీద 

తనను తాను పరుచుకుంటూ

వగలు పోతున్న ఉప్మా

నా ప్లేటును చేరిన క్షణం

మరో రుచి పుట్టిన రోజు


కాలికి అంటిన పుప్పొడి

మరో పూవుల వనానికి అంకురార్పణగా

సీతాకోకచిలుకను చూసినప్పుడు

మరో సృష్టి కోణపు పుట్టిన రోజు


ఓ కొత్త రకం జోక్ విన్నా

మరో భాషలో పాట విన్నా

కలిగిన కొత్త ఫీలింగ్స్ పుట్టిన రోజు


వీధి చివర బిచ్చగత్తె

భిక్ష పొంది చూసిన చూపు

మానవత్వానికి కొత్త పుట్టిన రోజు 


విడువనని బాస చేసి

విరిచిన మనసుతో నను వదిలిన రోజు

నీలోని గొప్ప నటునికి పుట్టిన రోజు


రోజూ 

క్షణమూ

ఒక పుట్టిన రోజు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract