పసుపు
పసుపు
శుభానికి సూచిక
శుభకార్యాలకు ప్రతీక
పుణ్య స్త్రీలకు భూమిక
పసుపు రంగు పీఠిక
పడతి మోమున
కాంతులీను గంధమై
వధువు మెడలో
మూడుముళ్ల బంధమై
పసుపు గడపతో
లక్ష్మీ కళయై
అలరాడు సనాతన
సాంప్రదాయపు
ముద్దుగుమ్మ పసుపు
సహజ సౌందర్య సాధనమై
దుష్ట శక్తులను తరిమే ఆయుధమై
శుభకార్యాలందు మంగళకరమై
దివ్య ఔషధ గుణాలతో
నాడు నేడు నిత్యం
పచ్చగా మెరిసెను
శుభమస్తూ అంటూ
