ప్రకృతి వైపరీత్యాలు
ప్రకృతి వైపరీత్యాలు


ఈ చేదు నిజాలు
మనుషులకొక సవాలు
ఎత్తాయంటే శివాలు
మిగుల్తాయి శవాలు !!
చెప్పి రాణి కష్టాలు
చెప్పలేని నష్టాలు
అలాగని అశనిపాతాలు
ప్రకృతి వైపరీత్యాలు !!
ఊహకందని వడగాలులు
దుంప తెంపే సుడిగాలులు
యమగండాలు సుడిగుండాలు
చెడుగుదాడే పిడుగులు
తొడగొట్టే వడదెబ్బలు
కబళించే చలి పులులు
చుట్టపు చూపు వరదలు
చేతికి రాని పంటలు
జోగి జోగి మంటలు !!
నాటికి నేటికీ ప్రకృతికి
సాటిలేదేనాటికి
ఎదురు నిలిచి వీటికి
గెలవలేరినాటికి !!