ప్రియురాలి మౌనమే
ప్రియురాలి మౌనమే
ప్రియురాలి మౌనమే శాపమై పోయింది
ఓమాట కలపడం కష్టమై పోయింది
కనురెప్పలకు హాయి దూరమై పోయింది
చెలి తీపి సంతకం స్వప్నమై పోయింది
పెదవులకు తాళమే వేసుకున్నట్లుంది
తేనియల పానమే గగనమై పోయింది
దయలేని జాబిలికి నా బాధ తెలియదా
నిప్పులను వర్షించు బింబమై పోయింది
బాధించు కాలమే పదునెక్కినట్లుంది
ప్రాణాలు తీస్తున్న బాణమై పోయింది
తూఫానులెవరికీ చూపలేకున్నాను
ఈ గుండె కల్లోలసంద్రమై పోయింది
హర్షాలు చిక్కుకున్నాయిలే నా ఊహల్లో
వేటాడు సమయమే జాలమై పోయింది

