ప్రేయసిగా
ప్రేయసిగా
దేవతవు! ప్రేయసిగా పిలవలేను చెలియా
మదినిండిన అనురాగం కొలవలేను చెలియా
పారేగోదారి ఎదురు ఈదవచ్చుగానీ
నీపలుకుల జడిముంగిట నిలవలేను చెలియా
ప్రజ్వలించు అగ్నిలోన నడవవచ్చుగానీ
నీచూపుల హిమజల్లులొ తడవలేను చెలియా
మొనదేలిన కరకురాతినెక్కవచ్చు గానీ
సుకుమారివి నీమేనుని తాకలేను చెలియా
సింధువులో అగాధాన్ని చూడవచ్చు గానీ
నీమనస్సు లోతుల్లో చేరలేను చెలియా

