STORYMIRROR

VENKATALAKSHMI N

Romance Action Fantasy

4  

VENKATALAKSHMI N

Romance Action Fantasy

ప్రేమవనం

ప్రేమవనం

1 min
319

మన చెలిమి

ప్రేమ వనమైతే

వనమాలినై కాపు కాయనా..

నా ఊహల కలల చిత్రాలకు

నీ నవ్వు సాక్ష్యమైతే

నిను రక్షించే రెప్పను కానా..

నా కనుల వెన్నెల వెలుగు

నీ రూపమే అయితే

అనవతరం తోడుండే రేయిని కానా..

నా తనువు వీణను మీటు

స్పందన రాగం నీ శ్వాసయితే

అనుక్షణం పలికించే కవితను కానా..

చీకటి నిండిన నా హృదయంలో

వెలుగు రేఖ నీవైతే

తొలి కిరణమై నీ మేనంతా

స్పృశించనా..

నా ఆనందాల ఆకాశమై

నువు వేచివుంటే

సప్తసముద్రాలను దాటి

ఆగమేఘాల మీద

నిను చేరుకోనా..

నా ప్రేమ కు అర్థం నువ్వయి

నను నడిపించు నాదానివే నువ్వైతే

ఆ అందాన్ని ఆస్వాదించే

అనుభూతిని కానా..


Rate this content
Log in

Similar telugu poem from Romance