STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమవలనే

ప్రేమవలనే

1 min
153


నిన్నతెలియని కొత్తభాషను నేర్చుకున్నది ప్రేమవలనే

నిన్న చూడని వింతలేవో తెలుసుకున్నది ప్రేమవలనే


 మదినితాకిన తలపులన్నీ ప్రేమవిరులుగ పూయుచున్నవి 

మధురసుధలను గుండెనిండా

దాచుకున్నది ప్రేమవలనే


తలపునందున ఆశలన్నీ తారలల్లే మెరియుచున్నవి 

మనసునిండా

వెలుగురేఖలు నింపుకున్నది ప్రేమవలనే


మాటలన్నీ మధుకరాలై తేనియలనే మోయుచున్నవి

మనసుదీరా మధురకావ్యం రాసుకున్నది

 ప్రేమవలనే


వలపుతోనే దేవిమదిలో చీకటంతా చెదిరిపోయెను

 జీవితమునే కాంతిమయముగ చేసుకున్నది

ప్రేమవలనే




Rate this content
Log in

Similar telugu poem from Romance