ప్రేమలేఖ
ప్రేమలేఖ
ఎలా రాయాలో తెలియదు ....
ఏం రాయాలో తెలియదు.....
కానీ రాయాలనిపిస్తోంది .....
నాలోని భావాలు అన్నిటిని అక్షరాలు గా మార్చాలి అని పిస్తుంది.....
కానీ అక్షరాలు ముందుకు కదలడం లేదు...
చూపుల్లో అర్థాన్ని చదివే భాష ప్రేమంట....
మరి నా ప్రేమ నా చూపుల్లో కనిపించలేదా?
నిన్ను చూసిన మొదటి రోజు నేను రెండో సారి పుట్టిన రోజు .....
నువ్వు లేనప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు
నువ్వు వచ్చాక చెప్పడానికి అక్షరాలు సరిపోవడం లేదు
నాలోని భావాలు గొంతు దాటడం లేదు కాబట్టి ఈ లేఖ రాస్తున్నాను....
అర్థం చేసుకుంటావని నిన్నే ఆరాధించే నీ ప్రేయసి......

