STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy

5.0  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy

ప్రేమకి సెలవా..!

ప్రేమకి సెలవా..!

1 min
372

ప్రేమ కి సెలవా!


కన్నీటి సంద్రంలో నా కలలన్ని కరిగిపోతున్నా

హృదయపు జ్వాలల్లో ఆశలన్నీ బూడిదయి పోతున్నా

నీ హృదయం లో నా శిలాఫలకం ముక్కలయి పోతున్నా

నీ మాటల ముళ్ళు మనసును ఛిద్రం చేస్తున్నా..


నా మౌనం నన్ను ప్రశ్నిస్తున్న 

నా కోపం నన్ను దహిస్తున్న

నా ప్రేమ నన్ను మరణం అంచులదాకా మోసుకెళ్తున్న


నీ ప్రేమ కోసం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాను 

కొత్త ఉషోదయంలో తొలి భానునిలా

శిశిరం తర్వాత వచ్చే వసంతంలా

ప్రణయ కావ్యాలు.. విరహ గీతాలు...

రాస్తూనే ఉంటాను... నీకు అంకితం చేస్తూనే ఉంటాను.

ఇక సెలవా ఈ జన్మలో ప్రేమ కి...


శ్రీలత..

హృదయ స్పందన.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy