STORYMIRROR

Nannam Lokesh

Romance Inspirational

4  

Nannam Lokesh

Romance Inspirational

ప్రేమించు...ప్రేమనుపొందు

ప్రేమించు...ప్రేమనుపొందు

1 min
595


ప్రేమించడం సులభము అనుకుంటాము

ప్రేమ కోసము కలలు కంటాము

ప్రేమను సాధించాలని ప్రయాసపడుతాము

ప్రేమను కలిగి ఉండాలని కృషి చేస్తాము


ప్రేమలో మధురము ఉంటుంది

ప్రేమలో ఆప్యాయత ఉంటుంది

ప్రేమలో అనురాగము ఉంటుంది

ప్రేమలో గౌరవము ఉంటుంది


ప్రేమ అనే రెండు అక్షరాలు

పలుకుట సులభము కానీ

ప్రేమలో జీవించాలి అని

అతురతతో ఎదురుచూస్తాము


ఏవిధంగా ప్రేమిస్తామో అదే ప్రేమని

తిరిగి పొందాలని వెయ్యి కన్నులతో వేచి చూస్తాము

ప్రేమ సాధారణ విషయము కాదు సుమా!

ప్రేమలో ఉన్న రహస్యము చాలా గొప్పది


ప్రేమను కొన్ని సార్లు చులకనగా చూస్తాము

కొన్ని సార్లు సాధ్యమా అనుకుంటాము

కానీ ప్రేమలో ఉన్న గొప్పదనము చవిచూస్తే కానీ

అర్ధము కాదు ఆ ప్రేమలో ఉన్న మహత్యము


ప్రేమించాలి అంటే మంచి మనసు ఉండాలి

ప్రేమించబడాలి అంటే అదృష్టము ఉండాలి

ఆ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలి అంటే

నమ్మకము ఉండాలి


ప్రేమను మాటల్లో చెప్పలేము కానీ

ప్రేమలో దాగివున్న 

ఆ రహస్యము తెలుసుకోవాలి అంటే

ప్రేమించు...ప్రేమనుపొందు


Rate this content
Log in

Similar telugu poem from Romance