STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Fantasy

4  

Dinakar Reddy

Abstract Drama Fantasy

ప్రేమికుడు - తుఫాను

ప్రేమికుడు - తుఫాను

1 min
362

మనసంతా ఏదో గందరగోళం

వాయుగుండం అంట

సముద్రం లుంగలు చుట్టుకుంటోంది

ఆమె జడ కొప్పులానే అది అర్థం కాకుండా ఉంది


నావలన్నీ తీరానికి వస్తున్నాయి

అతని అనుమానాల చిట్టాలాగా

ఇసుక రేణువులు లెక్కపెడుతూ కూర్చున్నాడు

ఒకటీ రెండూ అలా


ఆకాశం నల్లని ముసుగు కప్పుకుంది

ఇంక వెళ్ళిపో అన్నట్టు గాలి మూలిగింది

అతడు కదల్లేదు

మొండితనం 

కాదు ప్రేమ

ఆమె అంటే పిచ్చి


సముద్రం పొంగింది 

పొంగుతూ చీలింది

అదిగో అక్కడ ఓ కొండ మీద

సాగర కన్య 

నిజంగా సాగర కన్యే

తననే పిలుస్తోంది

అచ్చం కథల్లోలాగా


అతను వెర్రిగా నవ్వుతూ ముందుకు వెళ్లాడు

ఇంకా ముందుకు వెళ్ళాడు

సాగరమే ఉంది ఇంకేమీ లేదు

కానీ అతనికి తిరిగి వెళ్లాలని లేదు

ఏదో సాధించిన తృప్తి

కాస్సేపటికి తుఫాను తీరం దాటింది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract