ప్రేమ వనం-పేరడీ కవితా గీతం 1
ప్రేమ వనం-పేరడీ కవితా గీతం 1


జల్లు కురిసెను - పూలు విరిసెను తేనెలూరును మనకేలే
ఎందుకనో ఏమున్నదనో - మాకే తెలియనిదీ మనసూ
|| జల్లు కురిసెను||
చిలుకలు చేరి - తేనెలు త్రాగి మనకేమి మిగలదు ఈ తృటిలో
కలిసిన యెదలను గుర్తించి - ప్రేమే తేనెలు ద్రావించే ఈ వనిలో
కదిలిన భ్రమరం ఇచ్చే తీయదనం - మనకే కలిగే ఆనందం
|| జల్లు కురిసెను||
కోరిన చెలి కలిగించే ప్రీతీ - చిగురించే నాలో ప్రేమ గీతి
జల్లులకే మొలకెత్తే ప్రేమ మొలకలు - ప్రేమవృక్షమై వెలిగే వెలుగులు
ఈ అడవే ప్రేమవనం - పూల , పండ్ల మొక్కలే పిల్లల తో మనం
|| జల్లు కురిసెను||