ప్రేమ వేరు.. పెళ్లి వేరు..
ప్రేమ వేరు.. పెళ్లి వేరు..
అవునా నిజమా
ఇచ్చిన కొద్దీ తరగనిది ప్రేమని
నాకు ఇంకా ఇవ్వాలని అనిపిస్తోందనీ
కౌగిలించుకున్నావు
కరగని నా రాతి మనసును
లతలా అల్లుకుని
నాకూ ఆ మోహపు రుచి చూపించి
నన్ను బంధించావు
అవసరాలు తీరాక
ప్రేమ వేరు పెళ్లి వేరు అనీ
మనసు సాంత్వన పడాలి
మరో దేహంలో సుఖాన్ని గౌరవించాలి
అని ఏవో గొప్పగా ఆదర్శాలు అని చెబుతున్నావు
ఇప్పుడు అడ్డమైన కబుర్లు వినిపిస్తూ
నన్ను మభ్యపెడుతున్నావు
ప్రేమకు గమ్యం పెళ్లి కాదా
మరెందుకు ఈ వ్యవస్థ
నీ దగ్గర అంత ప్రేముంటే
ప్రపంచానికి పంచాల్సింది
నేనడగలేదే..