STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ప్రేమ పాఠం

ప్రేమ పాఠం

1 min
10

మనసువిప్పి చూపించే..అద్దమొకటి దొరికేనా..!

ప్రేమపాఠ మందించే..హృదయమొకటి దొరికేనా..!


మాట్లాడే తప్పనిసరి..గ్రహించుటే శాంతిప్రదం.. 

సౌఖ్యమేదొ పండించే..మార్గమొకటి దొరికేనా..! 


కణకణమున వేనవేల..మధుశాలలు ఉన్నవోయి.. 

కరుణమీర ఒలికించే..కలశమొకటి దొరికేనా..! 


చెలికన్నుల అనురాగం..నిజ'శార్వరి' సంగీతం.. 

విశేషముగ వినిపించే..రాగమొకటి దొరికేనా..! 


వియోగమను వనములోన..విహారమే రసయోగం.. 

ఈ 'నేను'ను మరపించే..తత్వమొకటి దొరికేనా..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance