ప్రేమ నివేదిక
ప్రేమ నివేదిక
చూపులే చదువుతుంది
అంతరంగ ప్రేమలేఖ,
పెనవేసుకున్న అనుబంధం దూరమవ్వదు ఏనాడూ ప్రేమలేక,
వలపు తెలుపు ప్రతీపలుకు
ప్రేమనివేదనే హృది చేరాక,
జ్ఞాపకాల వెల్లువే ప్రణయగీత
శ్రుతిలయల రాగమాలిక,
ప్రేమ స్పందనల గులాబీ
శ్వాసలను
ఏకం చేయడమే శుభలేఖ,
ఆరాధనా సమర్పణ
మనసు బరువు తొలిగిస్తేనే
పెళ్ళి వేడుక,
కామం పల్లవించని ప్రేమరాగం
స్వచ్ఛ ప్రేమకు ప్రతీక,
ధైర్యంతో ప్రేమను వెలిబుచ్చడమే
పరిమళ మనసుకు స్వాంతన,
భయ బ్రాంతుల సున్నితమౌ మనసుకు
ప్రేమరుచి చూపేదే ప్రేమనివేదిక,
ముసుగులేని మనసుతోడే
ఆశలకొండ ఎక్కించును ఇక,
ఊరించని ఊహల నివేదనల మాటే పెళ్ళిమంత్రమైతేనే
ప్రేమకు ధన్యత.

