STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Drama Fantasy Others

3  

Thorlapati Raju(రాజ్)

Drama Fantasy Others

ప్రేమ..అందరకీ ఉచితం!

ప్రేమ..అందరకీ ఉచితం!

1 min
206


క్షీరసాగరాన్ని మదించి...

అమృతాన్ని అందుకున్న...

ఆ దేవతా మూర్తులు


అమృతాన్ని మించిన..

ప్రేమామృతం పొందేందుకు...

ఇంకను..ప్రయత్నాలు 

చేస్తూనే ఉన్నారేమో...బహుశా!


ఎందుకంటే... అది

ఇంకను..మానవ లోకం లోనే

ఉంటూ....ప్రేమామృతాన్ని

పంచుతూనే ఉంది.


యుద్దం చెయ్యాలా...

తపస్సు చెయ్యాలా...

మాయ చెయ్యాలా...

లేక

మంత్రం..పఠించాలా..


పాపం ఏం చెయ్యాలో తెలియని

అయోమయ స్థితి ఆ దేవతలిది

ఏం చేస్తున్నా పొందలేక పోతున్నామే

అన్న...అసహనం..ఆ స్వర్గపురి వాసులది


కానీ..

ఆ ప్రేమామృతం మాత్రం

మానవ మాత్రుల మైన... మనల్ని

వరించిటం... మన అదృష్టం


ఈ ప్రేమ అనే పదార్థం

జగతిలో లేకుంటే...

జీవనం అనే పదానికే అర్థం లేదు


తల్లి బిడ్డను ప్రేమిస్తుంది

రాజు రాజరికాన్ని ప్రేమిస్తాడు

వర్తకుడు వ్యాపారాన్ని ప్రేమిస్తాడు

లోభి డబ్బు ను ప్రేమిస్తాడు


మంత్రి అహాన్ని ప్రేమిస్తాడు

అసూయా పరుడు పగని ప్రేమిస్తాడు

నాయకుడు పదివిని ప్రేమిస్తాడు


ఉద్యోగి హోదా ని ప్రేమిస్తాడు

విద్యార్థి లక్ష్యాన్ని ప్రేమిస్తాడు


ఆకలిగొన్న వాడు అన్నాన్ని ప్రేమిస్తాడు

దప్పిక గొన్న వాడు ద్రవాన్ని ప్రేమిస్తాడు


భార్య భర్తను ప్రేమిస్తుంది

ప్రియుడు ప్రేయసిని ప్రేమిస్తాడు

దేవుడు తన సృష్టిని ప్రేమిస్తాడు


ఇంత అద్భుతమైన ప్రేమ

అందరకీ ఉచితం..ఎంత విచిత్రం?


కానీ

ఉచితంగా వస్తుంది కదా అని...

మన ఒక్కరికే...కావాలి అనుకోవడమే...

ఇక్కడ వచ్చిన చిక్కు


ప్రతి ఒక్కరి ప్రేమలో...

తిరిగి ఆశించే గుణం ఉంది..

స్వార్థం ఉంది..

ఆఖరికి ఆ...భగవంతుడి ప్రేమలో కూడా


ఎందుకంటే...

తనకి నచ్చిన వారికి వరాలు

నచ్చని వారికి...శాపాలు ఇస్తాడు


ప్రేమ ను అందరకీ పంచటం

అనేది....మానవ జీవితంలో

అంత్యంత కష్టమైన వాటిలో ఒకటి

అదే...నిస్వార్థమైన ప్రేమ...

దానికి అర్థమే.... సేవ!


     .....రాజ్....



Rate this content
Log in

Similar telugu poem from Drama