ప్రాంప్ట్- 15:వచన కవిత : "కొంగల ఆహార స్వీకరణ" : కవీశ్వర్ ; 15 . 05 .202
ప్రాంప్ట్- 15:వచన కవిత : "కొంగల ఆహార స్వీకరణ" : కవీశ్వర్ ; 15 . 05 .202

1 min

271
ప్రాంప్ట్- 15
వచన కవిత : "కొంగల ఆహార స్వీకరణ" :
కవీశ్వర్ ; 15 . 05 .2023
దురాశ దుఃఖానికి చేటు - అన్న చందంగా పరికించగా
సృష్టిలో ఆహార విస్తరణము - ఆలా చేయబడిందిగా
వెతికిన వారికి/వాటికి అంతా - అవసరం ఉండదుగా
ఆ బకము బుర్రలో ఆలోచన - తగినంత ఆహారమే గా
పిండి కొద్దీ రొట్టె - ఎంతచెట్టుకు అంత గాలి ఉన్నట్టుగా
తనకు కలిగిన దానితో సంతృప్తి -- చెంది జీవించాలిగా
అతి సర్వత్రా వర్జయేత్ - పదార్ధం తీపిగా ఉంటె ఎక్కువగా
తినలేముగా - అవసరం ఉన్నంతగా తీసుకోవడమే ధర్మంగా
వ్యాఖ్య : " ఉన్నంతలో సంతృప్తి చెంది - అధికంగా ఉంటె
కొంతనే దాచుకుని మిగితాది దానం చెయ్యాలిగా!"