STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Drama

4  

Dinakar Reddy

Abstract Children Stories Drama

పొంగలి

పొంగలి

1 min
329

కుక్కర్ సిద్ధమే

కొద్దిగా నూనెలో ఆవాలు, జీలకర్ర చిటపలాడుతుంటే

అప్పుడే తెంపిన కరివేపాకు కలిసి కబుర్లు చెబుతుంటే

ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెతికి మరీ వెళ్లాయి

అలా అలా నెయ్యి కాస్త జారింది


తెరలు తెరలుగా మన నవ్వులు

తరిగిన అల్లం 

ఆపైన మిరియాలు 

శుభ్రం చేసుకున్న పెసరబ్యాళ్లు

తగినంత నీటితో పాటు ఉప్పు

అన్నీ కలుపుకుని 


కుక్కర్ కొన్ని విజిల్స్ వేసేలోపు

చెనిగ్గింజల చట్నీ కొట్టేసి

వేడి వేడి పొంగలి పైన మరికాసింత నెయ్యి తగిలించి

ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ

పొంగలి చట్నీ ఇంకా కాస్త ఊరగాయలో అద్ది

అలా అలా తింటూ ఉంటే

ఆహా అప్పుడే కనిపిస్తుంది స్వర్గ ద్వార తోరణం

నారాయణుడు భోక్తగా 

ఆత్మా రాముడికి తృప్తిగా నైవేద్యం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract