పండుగ
పండుగ
తెచ్చును పిల్లల కళ్ళల్లో మెరుపు
వేసుకుంటే ఆనందపు అరుపు
దోస్తులకు చూపిస్తూ మైమరపు
చూసిన పెద్దలకి కల్గు గెలుపు
కొత్తబట్టలు అంటేనే పండుగ
తలస్నానం,కొత్తబట్టల హంగామా!
గణపతిని అలoకరిద్దామా!
పూజా పునస్కారాలు చేద్దామా!
కమ్మనైన విందు కలసి తిందామా!
పండుగ పూట భలే పసందుగా!
