పలకరింపు
పలకరింపు
హృద్యమైన పలకరింపు మాటలతో చేరుతుంది
సన్నిహితుల హృదయాలను చేవ్రాలుతొ చూపుతుంది
సుదూరాన ఉన్నవారి క్షేమాలను తెలుపుతుంది
కన్నవారి ప్రేమనంత కనులముందు నిలుపుతుంది
ఎవరిరాత ఎలాఉందో కందోయికి చూపిస్తూ
విడిపోయిన చిన్ననాటి స్నేహితులను కలుపుతుంది
ఆదరించ ఆచరించ తనవునికిని చూపిస్తూ
స్వచ్ఛమైన ప్రేమికులకు వారధియై ఉంటుందీ
పలుభాషల పలురాతల మర్మాన్నే తెలుపుతుంది
తుడిచిపోక చెదరిపోక తరతరాలు నిలుస్తుంది

